BJP MP Laxman : శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్..
తిరుమల శ్రీవారిని బిజెపి రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ...నా పుట్టినరోజు సందర్భంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందిన్నారు.కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా శ్రీవారు ప్రసిద్ధి చెందారని తెలిపారు.