ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో బ్రేక్ దర్శనం ప్రారంభం కానుంది. నేటి నుంచి ప్రతి రోజూ ఉదయం 10:15 గంటల నుంచి 11:15 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. టికెట్ ధర ఒక్కరికి రూ.300 చొప్పున నిర్ణయించినట్లు పేర్కొన్నారు. బ్రేక్ దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
తిరుమలలో భక్తుల కోసం స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ఉంటుంది. ఒక్కొక్కరికి రూ.300 తీసుకొని, స్పెషల్ దర్శన టికెట్ ఇస్తారు. టీటీడీ యాప్, ఆన్ లైన్‌లో మాత్రమే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. వేములవాడలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆ క్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే వీటీఏడీఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. బ్రేక్ దర్శన టికెట్ అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రతిపాదనలను దేవదాయశాఖ కమిషనర్‌కు పంపించారు. ఆమోదం తెలుపడంతో ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యింది.