నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో శ్రీ పెనుశీల లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. హంసవాహనం పై సరస్వతి అలంకరణలో భక్తులకు స్వామి దర్శనమిచ్చారు. కోనలోని అలంకార మండపంలో హంసవాహనాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి అందులో లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మీ అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి, ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం మేళ తాళాలు, వేద మంత్రాలతో శ్రీవారు హంసవాహనంలో కోన మాడ వీధుల్లో విహరించారు. పారువేట మండపం వరకు క్షేత్రోత్సవం నిర్వహించగా... భక్తులు కాయ కర్పూరం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.