Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ .. 15 గంటల సమయం

Update: 2025-08-13 07:30 GMT

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 15 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఆగస్టు 12న (మంగళవారం) 82,628 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.ఆగస్టు 12న శ్రీవారి హుండీ ఆదాయం ₹3.73 కోట్లుగా ఉంది. 30,505 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మొన్నటి వరకు వర్షాల కారణంగా భక్తుల రద్దీ కాస్త తగ్గినప్పటికీ, ఇప్పుడు మళ్లీ భక్తుల సంఖ్య పెరిగింది.

Tags:    

Similar News