TTD : తిరుమలలో భక్తుల రద్దీ.. వైభవంగా గరుడ సేవ

Update: 2025-07-11 07:30 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తులు కంపార్ట్‌మెంట్లు దాటి శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 63,473 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,796మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.54కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

గురువారం గురు పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో గరుడవాహన సేవ నిర్వహించారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల సమయంలో శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపైమాఢవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. గరుడవాహనంపై వచ్చిన స్వామివారిని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. గోవింద నామస్మరణలతో వీధులన్నీ మార్మోగాయి.

Tags:    

Similar News