Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. స్వామి వారి దర్శనానికి ఎంత టైమ్ అంటే..?
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో తిరుమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తులు కంపార్ట్‌మెంట్లు దాటి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. బుధవారం స్వామివారిని 75,104 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 31,896 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.66 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.