TTD : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Update: 2024-04-13 06:32 GMT

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. పిల్లలకు సెలవులు కావడంతో అలాగే పరీక్ష ఫలితాలు వస్తున్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. స్వామి వారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి ఏటీజీహెచ్ వరకు భక్తులు వేచి ఉన్నారు. ఇక మరోవైపు 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి గాను భక్తులకు నాలుగు గంటల సమయం స్వామి వారి దర్శనానికి పడుతుంది.

స్వామివారి దర్శనం కోసం టైం స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. వీరందరికీ దాదాపు 5 గంటల సమయం పైనే స్వామి వారి దర్శనానికి సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 63,163 మంది భక్తులు దర్శించుకోగా.. 31,287 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.2.99 కోట్లు సమకూరింది. .ఈ నెల 17న శ్రీవారి ఆలయంలో ‌శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనుంది టీటీడీ. ఈ సందర్భంగా పలు ఆర్జిత సేవలు రద్దు చేసింది. ఏప్రిల్ 18న ‌శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనుంది టీటీడీ.

Tags:    

Similar News