తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులను నేరుగా క్యూలైన్లలోకి పంపుతుండటంతో, ఉ.7గంటల వరకు కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఉ.8 గంటలకు బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇకపై భక్తులను కంపార్ట్‌మెంట్లలోకి పంపనున్నారు. వారు శ్రీవారిని దర్శించుకోవడానికి దాదాపు 8గంటల సమయం పట్టే అవకాశం ఉంది. నిన్న 52,731 మంది దర్శించుకోగా 17,664 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.24 కోట్లు వచ్చింది. కాగా- ఈ నెల 9 నుండి 13వ తేది వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తోన్నారు టీటీడీ అధికారులు. ఆలయ పుష్కరిణిలో నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఇదివరకే సమీక్ష సమావేశం నిర్వహించారు.