ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినూత్న డబ్బుల గణపతి ఆకట్టుకుంటున్నాడు. కరెన్సీ గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 2.7 కోట్ల రూపాయల నోట్లను వినియోగించి మండపాన్ని అలంకరించారు. నందిగామలోని వాసవి మార్కెట్‌లో గత 42 ఏళ్లుగా గణపతి నవరాత్రులను నిర్వహిస్తున్నారు. గతేడాది 2కోట్ల 30 లక్షల రూపాయల నోట్లతో వినాయకుడిని తీర్చి దిద్దగా ఈసారి 2.7 కోట్ల రూపాయలను వినియోగించారు. పది, ఇరవై, 50, 100, 200, 500 రూపాయల నోట్లతో మండపాన్ని మొత్తం అలంకరించారు.
డెకరేషన్‌లో వాడిన నోట్లన్నీ కొత్తవే. అన్నీ కడక్ కడక్ గా కనిపిస్తున్నాయి.. నోట్లతోనే కలువపూలుగా రూపొందించారు. నోట్లతోనే ఆర్చ్‌లను నిర్మించారు. మొత్తం మీద కొంతకాలంగా వాసవి మార్కెట్లో నిర్వహిస్తున్న ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. భారీ కరెన్సీ ఉపయోగిస్తుండటంతో బందోబస్తు టైట్ గా ఉంచారు.