Konda Surekha : రూ. 345 కోట్లతో జోగులాంబ ఆలయ అభివృద్ధి : మంత్రి కొండా సురేఖ

Update: 2025-09-30 07:45 GMT

రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని రూ. 345 కోట్లతో అభివృద్ధి చేస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పునరుద్ఘాటించారు. నవరాత్రుల సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారిని సురేఖ దర్శించుకున్నారు. దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు....కొండాసురేఖ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అమ్మవారి ఆలయాన్ని మూడు విడతలుగా అభివృద్ధి చేయనున్నట్లు సురేఖ తెలిపారు..

Tags:    

Similar News