ఇంద్రకీలాద్రి పై సెప్టెంబర్ 22 నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతాయని ఆలయ ఈవో శీనానాయక్ తెలిపారు. ఈ మేరకు నవరాత్రులకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. సెప్టెంబర్ 22న బాలా త్రిపుర సుందరి గా, 23న గాయత్రీ దేవి గా, 24 న అన్నపూర్ణ దేవి గా, సెప్టెంబర్ 25న కాత్యాయని దేవి గా, 26న మహాలక్ష్మి గా, 27న లలితా త్రిపుర సుందరి గా, 28న మహా చండీ దేవి గా, 29వ సరస్వతి దేవి గా, 30న దుర్గాదేవి గా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పూర్ణా హుతి కార్యక్రమం జరగనుంది. కాగా సెప్టెంబర్ 29 న సీఎం చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అక్టోబర్ 2 న సాయంత్రం ఐదు గంటలకు కృష్ణా నదిలో హంసవాహక తెప్పోత్సవం నిర్వహించనున్నారు.