Sri Sailam : శ్రీశైలంలో మందు తాగి డ్యూటీకి హాజరైన ఉద్యోగి.. భక్తుల దేహశుద్ధి

Update: 2024-08-02 10:06 GMT

శ్రీశైలం ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగికి భక్తులు దేహశుద్ధి చేశారు. క్యూ కంపార్టుమెంట్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఉదయం ఈవో పెద్దిరాజుకు భక్తులు ఫిర్యాదు చేశారు. ఘటనపై భక్తులు క్యూలైన్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. డిప్యూటీ ఈవో జి.స్వాములు అక్కడికి చేరుకుని భక్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆలయ సిబ్బంది మద్యం తాగి విధుల్లో పాల్గొంటే ఏం చేస్తున్నారని భక్తులు ఆయన్ను నిలదీశారు. ఆలయ పవిత్రతను కాపాడటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News