Indrakiladri : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. వరలక్ష్మీ దేవిగా దుర్గమ్మ దర్శనం
శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వరలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామునే అమ్మవారికి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాన్ని వివిధ పుష్పాలతో అందంగా అలంకరించారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నెల 22న ఐదో శుక్రవారం మల్లిఖార్జున మహా మండపంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు ఈవో శీనానాయక్ తెలిపారు.