అయ్యప్ప కొలువైన శబరిమల కొండకు భక్తులు తండోపతండాలుగా పోటెత్తారు. అయ్యప్ప దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. సన్నిధానం నుంచి పంబ వరకు భక్తులు భారీగా క్యూలైన్‌లో వేచి ఉన్నారు. రోజులు 70 నుంచి 80వేల మంది అయ్యప్ప భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. దాంతో శబరిమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఈసారి భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేశారు. అడవి, ఘాట్ రోడ్డులో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.