Yadadri Temple : వరుస సెలవు దినాలతో యాదాద్రి కి పోటెత్తిన భక్తులు..

Update: 2025-07-12 11:00 GMT

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడం తో హైదరాబాద్ నుండి భారీగా ప్రజలు స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. జంట నగరాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. దీంతో స్వామివారి ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. భక్తులు అధికంగా శ్రీ స్వామివారి సుదర్శన నారసింహ హోమం, నిత్య కళ్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పాల్గొంటున్నారు. కొండపైనే ఉన్న శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. రేపు కూడా సెలవు దినం కావడంతో మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు అధికారులు..ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News