తిరుపతి లడ్డూ ప్రసాదంపై చెలరేగిన వివాదంపై ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. భక్తి లేని చోట పవిత్రత ఉండదన్నారు. హిందూ దేవాలయాలు ప్రభుత్వ పాలనలో కాకుండా హిందు భక్తులచే నిర్వహణ సమయం ఆసన్నమైందని చెప్పారు. ఆలయ ప్రసాదంలో గొడ్డు నెయ్యి అసహ్యకరమైనదిగా భావిస్తున్నట్లు తెలిపారు.
తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఎవరైనా చర్యలు తీసుకుంటున్నారా అని ప్రతి రాష్ట్రం చెక్ చేసుకుంటోంది.