Tirupathi : భగవంతుని అనుగ్రహం పొందడానికి భక్తి ఒక్కటే మార్గం : మేడసాని మోహన్

Update: 2025-09-01 06:15 GMT

భగవంతుని అనుగ్రహం పొందడానికి భక్తి ఒక్కటే మార్గమని మేడసాని మోహన్ తెలిపారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి 160వ జయంతి వేడుకలు సందర్భంగా ఆదివారం పలువురు వక్తలు మాట్లాడారు.

ఈ సందర్భంగా మేడసాని మోహన్ మాట్లాడుతూ, భగవంతుని నమ్మి చెడిపోయిన వారు లేరని అన్నారు. హరి అంటే చేసిన పాపాలు పటాపంచలు అవుతాయన్నారు. భక్తులలో ప్రథమ స్థానంలో ప్రహ్లాదుడు ఉన్నారన్నారు.

ముందుగా హరికథ ప్రాశస్త్యం మీద వక్తలు మాట్లాడారు. డిపిపి కళాకారులు ఆదిపట్ల నారాయణ దాసు గారి కీర్తనలపై గోష్ఠి గానం చేశారు. హరికథ ధర్మ ప్రచారం మీద డా. వై. వేంకటేశ్వరులు భాగవతులు ఉపన్యసించారు. హరికథ పితామహులు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి జీవిత విశేషాలు మీద శ్రీమతి పి.వరలక్ష్మీ భాగవతారిణి ఉపన్యసించారు.

డా. ఎం. డాక్టర్ ఎంవీ సింహాచల శాస్త్రి భాగవతులు గారు హరికథ గానం భక్త మార్కండేయ మీద మాట్లాడారు. శ్రీ పరాయితం నారాయణాచార్య భాగవతులు హరికథ గానం – భక్త శబరి అనే అంశంపై ప్రసంగించారు.

తదుపరి సాయంత్రం హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కథకులు శ్రీ ఎం. రాముడు భాగవతులు హరికథా గానం పార్వతి కళ్యాణం అనే అంశం మీద మాట్లాడగా, డా.వై. వెంకటేశ్వర్లు బాగోదులు వారు హరికథ గానం – గజేంద్రమోక్షం అనే అంశం మీద మాట్లాడారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా డాక్టర్ వి. విజయకుమారి భగవతారని వ్యవహరించారు.

Tags:    

Similar News