Dhanurmasa Begins : నేటి నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం..

Update: 2024-12-16 11:30 GMT

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి మాసాత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 17 వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత స్థానంలో తిరు ప్పావై నివేదిస్తారు. కాగా జనవరి 14 న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతి రోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవే ద్యాలు దోశ, బెల్లందోశ, సుండలు, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు. ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం ఉంది. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదాయనికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకం గా ప్రార్ధిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

Tags:    

Similar News