దసరా శరన్నవరాత్రుల కోసం ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. అక్టోబర్ 3న ఘట స్థాపనతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అలాగే అక్టోబర్ 12న విజయదశమి వేడుకతో ముగుస్తాయి. శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు దుర్గాదేవి అవతారాలను శక్తి, జ్ఞానానికి సంబంధించిన దేవతగా పూజిస్తారు. సామాన్య భక్తులకు అధికారులు పెద్ద పీట వేస్తున్నారు. సర్వదర్శనం నుంచి ప్రత్యేక దర్శనం వరకు అన్ని దర్శనాలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.