వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి.శ్రీ పోలేరమ్మ తల్లి జాతర రాష్ట్ర పండుగ గుర్తింపు వచ్చింది.
వెంకటగిరి పోలేరమ్మ జాతర నాలుగు రోజులపాటు పట్టణంలో సాంస్కృతి కార్యక్రమాలతో పండగ వాతావరణం నెలకొల్పింది.
దశాబ్ద కాలం నుండి రాజుల కాలం నుంచి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
జాతర ప్రత్యేక అధికారి గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పర్యవేక్షణలో క్యూలైన్లు ఏర్పాటు భద్రత చర్యలు ప్రత్యేక విఐపి లు క్యూలైన్లో, దేవాదాయ శాఖ ప్రత్యేకంగా రూ, 100,300 రూపాయలు దర్శనం టికెట్లు భక్తులకు క్యూలైన్ ఏర్పాటు, ఉచిత క్యూలైన్లు సదుపాయం, ఉచిత ప్రసాదం, అంశాలపై అధికారులతో చర్చించి ఆయన శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మనగన్న అమ్మ పుట్టినిల్లు కుమ్మర వీధి, శ్రీ పోలేరమ్మ తల్లి మెట్టినిల్లు ప్రాంతం జీనిగిల వారి వీధి భక్తులకు పట్టణ నడి ఒడ్డున అమ్మవారి దేవస్థానం నిలుపు స్థలం ఆయన ప్రత్యేకంగా క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి జాతర అంగరంగ వైభవంగా జరిగేలా సర్వసిద్ధం సౌకర్యాలు అధికారులు పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి, భక్తులకు ఎలాంటి అవాంఛ సంఘటన జరగకుండా భక్తులకు మంచి గా దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు.