పూర్వగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు!
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ ఆలయంగా విరాజిల్లుతోన్న పూర్ణగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉత్సవ శోభ నెలకొంది.;
నల్గొండ జిల్లాలోని పూర్వగిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ ఆలయంగా విరాజిల్లుతోన్న పూర్ణగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉత్సవ శోభ నెలకొంది. నేటి నుంచి 21 వ తారీకు వరకు నాలుగు రోజుల పాటు ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతాయి. అనంతరం.. ఈనెల 22 నుంచి 28 వరకు శ్రీ పూర్ణగిరి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. 6 రోజుల పాటు స్వామి వారికి జరిగే నిత్యపూజలు,కళ్యాణం,అభిషేకం,అర్చనలు రద్దు చేశారు.