Former Vice President : తిరుమల శ్రీవారి సేవలో మాజీ ఉపరాష్ట్రాపతి వెంకయ్య నాయుడు

Update: 2025-07-28 12:45 GMT

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాజీ ఉపరాష్ట్రాపతి వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం మహా ద్వారం వద్దకు చేరుకున్న వెంకయ్య నాయుడుకి ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు ఆలయ విశిష్టత, ప్రాముఖ్యత గురించి వివరించారు. ధ్వజస్తంభానికి నమస్కరించి…. ఆలయ ప్రవేశం చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు శ్రీ వారి శేష వస్త్రంతో సత్కరించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మాజీ ఉపరాష్ట్రాపతి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ….ప్రతి ఒక్కరికి దైవభక్తితో పాటు సమాజ భక్తి తో ఉండడం కూడా అవసరమని చెప్పారు.ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం హిందువుల స్పూర్తి కేంద్రమని తెలిపారు. వెంకటేశ్వర స్వామికి వచ్చే కానుకలు పూర్తిగా ధార్మిక ,భక్తుల సౌకర్యాలు మాత్రమే ఉపయోగించాలని కోరారు. ఈ విసయంలో ప్రభుత్వాల జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిదని సూచనలు చేశారు. హిందువుల సంప్రదాయాల ప్రకారం ప్రతి ఊరిలో గుడి ఉండాలని…. ప్రముఖ దేవాలయాలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చెప్పట్టాలని తెలిపారు. గుడి బడి లేని ఊరు ఉండకూడదన్నా ఆయన…. బడి కట్టించడం ప్రభుత్వ కర్తవ్యం, గుడి కట్టించడం భక్తులు మరియు ప్రముఖ దేవస్థానాల ప్రధాన కర్తవ్యం గా ఉండాలని అన్నారు. సామాన్య భక్తులకు సౌకర్యార్థం సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్వామి వారి దర్శనానికి విచ్చేయవలసిందిగా ప్రముఖులను కోరుకుంటున్నానని చెప్పారు. ఇది నా సలహా మాత్రమేనని …ప్రజా ప్రతినిధులు దేవస్థానానికి వచ్చినప్పుడు మరింత బాధ్యతతో మరింత హుందాగా వ్యవహరించాలని నేను భావిస్తున్నట్లు తెలియజేశారు..

Tags:    

Similar News