Tirumala : తిరుమల శ్రీవారి సేవలో గాలి జనార్థన్ రెడ్డి..

Update: 2025-07-30 07:00 GMT

పునీత్ రాజ్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్ స్పూర్తితోనే సినిమాలలోకి వచ్చానన్బారు కన్నడ యువ హీరో కిరీటి. ఇటీవల కిరీటి హీరోగా నటించిన జూనియర్ సినిమా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇవ్వళ తండ్రి గాలి జనార్ధన్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయక మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ అధికారులు శేష వస్ర్తంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు చాందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... స్వామివారి ఆశీశ్సులతో జూనియర్ సినిమా పెద్ద హిట్ అయిందని సంతోషం వ్యక్తం చేశారు. సినిమాను ఆధరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కన్నడలో పునీత్ రాజ్‌కుమార్, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితోనే సినిమాలలోకి వచ్చినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News