తిరుమలలో ఈ నెల 29న గరుడ పంచమి పర్వదినంగా ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు మలయప్పస్వామి గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెలలో స్వామివారు రెండో సారి గరుడ వాహనంపై దర్శనమివ్వనున్నారు. ప్రతి ఏడాదీ తిరుమలలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉండేందుకు.. స్త్రీలు తమకు పుట్టే సంతానం మంచిగా ఉండేందుకు ”గరుడపంచమి” పూజ చేస్తారని పురాణాలు చెబుతున్నాయి.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్ లో వేచి ఉన్నారు. ఆదివారం శ్రీవారిని మంది 87,138 భక్తులు దర్శించుకోగా.. 30,099 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయంరూ.4.33 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.