శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా రెండో రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్నారు. ఇవాళ గాయత్రీ మంత్రాన్ని పఠించాలి. ‘ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః.. యుక్తా మిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్| గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీభజే॥’ గాయత్రీ అమ్మవారిని దర్శిస్తే ఆరోగ్యం లభిస్తుంది.ఇక, మొదటి రోజు అమ్మ వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.. అనూహ్యంగా.. ఊహించని దానికంటే భక్తుల రద్దీ పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు.. శ్రీ శక్తి పథకం ఫ్రీ బస్సు ఉండడంతో భారీగా అమ్మ వారి ఆలయానికి తరలివచ్చారు మహిళలు.. దసరా నవరాత్రులు 11 రోజుల పాటు రూ. 500 టికెట్స్ రద్దు చేశారు.. 300 రూపాయలు టికెట్స్, 100 టికెట్స్ అందుబాటులో ఉంచారు ఆలయ అధికారులు.. మొదటి రోజు ఏకంగా 75,000 మంది అమ్మ వారిని దర్శించుకున్నారు.