మంత్రాలు నేర్చుకునేందుకు మంచి ఘడియలు వచ్చేశాయి..!

Update: 2024-02-10 09:39 GMT

మంచి కార్యక్రమాలు, కొత్త విద్యలు నేర్చుకోవడం మొదలుపెట్టేందుకు ఎంతో మంచిదైన మాఘ మాసం మొదలైంది. శుక్ల పక్షంలో వచ్చే నవరాత్రులనే గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు మాఘ గుప్త నవరాత్రులు ఉంటాయి. నేటినుంచే మాఘ గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి.

దుర్గాదేవి యొక్క పది రూపాలను గుప్త నవరాత్రులలో పూజించాలని పండితులు చెబుతున్నారు. అమ్మవారి రూపాలను శక్తి రూపంలో పూజిస్తే, సంపద, సంక్షేమం వెల్లివిరుస్తాయనేది నమ్మకం.

దేవీ భాగవతంలో చెప్పినట్టుగా కాళికా దేవిగా, తారా దేవి, త్రిపుర సుందరి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, ధూమావతి, బగ్లాముఖి, మాతంగి, కమలా దేవిగా 10 రూపాలలో అమ్మవారిని పూజించాలి. ఈ నవరాత్రులలో, ఐదు రవియోగాలు, నాలుగు జయయోగాలు, రెండు సర్వార్థ సిద్ధి యోగాలు, రెండు సర్వార్థ అమృత సిద్ధి యోగాలు, ఒక త్రిపుష్కర సిద్ధి యోగం అరుదైన కలయికగా ఏర్పడతాయని పండితులు వివరిస్తున్నారు. ఒక ఏడాదిలో మొత్తం నాలుగు నవరాత్రులు మాత్రమే ఉంటాయి. మాఘ మాసంతో పాటు చైత్ర, శరత్, ఆషాడ మాసాల్లోనూ గుప్త నవరాత్రులు వస్తాయి. గుప్త నవరాత్రుల సమయం.. మంత్ర- తంత్ర అభ్యాసానికి అనువైనదనే వివరణ కూడా ఉంది.

Tags:    

Similar News