TTD : తిరుమలలో దంచికొడుతున్న వానలు.. భక్తులకు అలర్ట్

Update: 2024-10-16 07:15 GMT

తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రెండో ఘాట్ రోడ్డులో వినాయకుడి గుడి తర్వాత మలుపు దగ్గర మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. అప్రమత్తమైన టీటీడీ జేసీబీల సాయంతో మట్టిపెళ్లలను తొలగిస్తోంది. రెండో ఘాట్ రోడ్డులో అక్కడక్కడ విరిగిపడుతున్న మట్టిపెళ్లలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు అధికారులు. రెండో ఘాట్ రోడ్డులో మొబైల్ స్వ్కాడ్ టీమ్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. ఘాట్ రోడ్డును నిరంతరాయంగా తనిఖీ చేస్తున్నారు. భక్తులు స్వీయ రక్షణ, భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Full View

Tags:    

Similar News