Yadadri : 3D యానిమేషన్‌లో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి చరిత్ర
Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మహాద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. స్వామివారి దివ్య చరిత్రను త్రీడీ యానిమేషన్ రూపంలో భక్తులకు చూపించనున్నారు.;
Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మహాద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. స్వామివారి దివ్య చరిత్రను త్రీడీ యానిమేషన్ రూపంలో భక్తులకు చూపించనున్నారు. పంచనారసింహుడి చరిత్రను దృశ్య రూపకంలో తిలకించే విధంగా ఉత్తర రాజగోపురంపై త్రీడీ యానిమేషన్ మ్యాపింగ్ ద్వారా చూపించనున్నారు. బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ సంస్థ రూపొందించిన ఈ సాంకేతికతను నిన్న ట్రయల్ రన్‌లో పరీక్షించారు. వచ్చే ఏడాది మార్చి 28న స్వామివారి ఆలయాన్ని పునఃప్రారంభించనున్న నేపథ్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తుంటి వైటీడీఏ. యాదాద్రిలో స్వామివారు ఉద్భవించిన తీరు, ప్రహ్లాద చరిత్ర, పంచనారసింహుడి అవతారాలు, ఉత్తర దిశ పంచతల రాజగోపురంపై త్రీడీ యానిమేషన్ ద్వారా భక్తులను చూపించనున్నారు. చిన్న పిల్లలతోపాటు వృద్ధులకు సైతం చక్కగా కనిపించేలా అధునాతన సాంకేతికతను వైటీడీఏ వినియోగించనుంది.