TTD Trusts : టీటీడీకి భారీ విరాళాలు

Update: 2025-09-01 05:54 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడిచే వివిధ ట్రస్టులకు విరాళాలు వెల్లువెత్తాయి. ఒకే రోజు ప్రముఖ సంస్థలు, వ్యక్తుల నుంచి కోట్లాది రూపాయలు విరాళంగా అందాయి. హైదరాబాద్ కు చెందిన ఆర్.ఎస్.బి రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆదివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.2,92,91,840 (రూ.2.93 కోట్లు) ను విరాళంగా అందించింది. అదేవిధంగా ఆర్.ఎస్.బ్రదర్స్ జ్యూవెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్ట్ కు రూ.1.10 కోట్లు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థల ఎండీలు శ్రీ పొట్టి వెంకటేశ్వర్లు, శ్రీ సీర్న రాజమౌళి, శ్రీ టి.ప్రసాదరావు, శ్రీమతి పొట్టి మాలతి లక్ష్మీ కుమారిలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు విరాళం డీడీలను అందజేశారు. కాగా నర్సారావు పేటకు చెందిన శ్రీ జె.రామాంజనేయులు శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

Tags:    

Similar News