Vijayawada : ఇంద్రకీలాద్రి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ఇదే

Update: 2024-08-28 12:30 GMT

దసరా నవరాత్రి ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. అక్టోబర్‌ 3 నుంచి 12 వరకు ఈ దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే బెజవాడ దుర్గమ్మ అవతారాల తేదీలను ఆలయ అధికారులు ప్రకటించారు.

3న బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. 4న గాయత్రీదేవిగా, 5న అన్నపూర్ణ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక 6న లలితా త్రిపుర సుందరీదేవిగా, 7న మహాచండీ గా దర్శనమిస్తారు. 8న మహాలక్ష్మీ దేవి అవతారంలో, 9న సరస్వతి , 10న దుర్గాదేవి, 11న మహిషాసురమర్దిని, 12న రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు.

భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు EO రామారావు తెలిపారు.

Tags:    

Similar News