BR Naidu : తిరుమల పవిత్రతను కాపాడటం మా కర్తవ్యం

Update: 2025-08-27 15:00 GMT

తిరుమల పవిత్రతను కాపాడుతూ, సప్తగిరులను ఆనుకుని ఉన్న భూములను అన్యాక్రాంతం కానివ్వమని, ఆ భూమిని భక్తుల సౌకర్యాల కోసం వినియోగించనున్నట్లు టీటీడీ చైర్మన్ శ్ బీఆర్ నాయుడు తెలిపారు. టిటిడి మీద చేస్తున్న విష ప్రచారపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

2008లో పిపిపి ద్వారా 30.32 ఎకరాల టూరిజం ల్యాండ్ ను దేవలోక్ కు ఇవ్వాలని ఎంవోయూ చేసుకున్నారు. 2011న ఇంటర్నేషనల్ బెడ్డింగ్ ప్రాసెస్ ద్వారా ఎల్.ఓ.ఐ ద్వారా దేవలోక్ కేటాయింపు, 2014న ఆ భూమిని దేవలోక్ కు టూరిజం శాఖ కేటాయింపు, 2021 ఏడాదిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ ఇవ్వగా, గత ప్రభుత్వం 20 ఎకరాల భూమిని ఒబెరాయ్ హోటల్ కు, మరో 5 ఎకరాలు మేడా ప్రాజెక్ట్ కు కేటాయించారని తెలిపారు. సదరు హోటల్ కు భూములు కేటాయించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ధర్నాలు, నిరసనలు చేపట్టారని గుర్తు చేశారు.

18.11. 2024 లో టిటిడి బోర్డు రెండో అంశం క్రింద సదరు అంశాన్ని చర్చించి ప్రైవేటు హోటల్ కు ఇవ్వడం సబబు కాదని తీర్మానం చేసి గవర్నమెంట్ కు పంపామన్నారు. మార్చి 21న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల వచ్చిన సందర్భంలో ఈ అంశంపై చర్చించి సదరు 25 ఎకరాలతో పాటు మిగిలిన భూములను కలిపి మొత్తం 50 ఎకరాల భూమిని టిటిడి తీసుకోవాలని నిర్ణయించిందన్నారు. ఒబెరాయ్ హోటల్ వారితో స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు సంప్రదింపులు చేసి మరోచోట రోడ్డుకు అటు వైపు స్థలం కేటాయించేందుకు అంగీకరించేలా ఒప్పించారని తెలిపారు. సదరు హోటల్ నిర్మాణానికి ఇప్పటికే రూ. 30 కోట్లు ఖర్చు చేశామని మొండికేయడంతో ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని స్థలం మార్పిడికి అంగీకరించేలా చేసారన్నారు. దీనికి సంబంధించి స్థలం మార్పిడి అంశం ప్రాసెస్ లో ఉండగానే కొంత మంది ఉద్దేశ్యపూర్వకంగా రోజుకో విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

Tags:    

Similar News