పంచారామ క్షేత్రమైన పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం తొలి సోమవారంతో భక్తులు దర్శనానికి బారులు తీరారు. క్షీరా రామలింగేశ్వర స్వామి మూలవిరాట్‌కు అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి హరిహర మహాదేవ అంటూ వేలాది మంది భక్తులు శివ నామస్మరణ చేస్తున్నారు.