Kedarnath Temple : తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం.. 13 వందల కిలోల బంతిపూలతో అలంకరణ

Update: 2025-05-02 08:15 GMT

ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లోని కేదార్ నాథ్ ఆలయం తలుపులు నేడు తెరుచుకున్నాయి. ఆలయం అలంకరణ కళ్లు చెదిరేలా ఉంది. భక్తులకు కనువిందు కలిగించే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 1300 కిలోల బంతిపూలతో ఆలయాన్ని అలంకరించినట్టు నిర్వాహకులు తెలిపారు. శ్రీ బాబా కేదార్నాథ్ ధామ్ టెంపుల్ మే 2వ తేదీన ఉదయం 7 గంటలకు తెరుచుకుంది. 12 జ్యోతిర్లింగాల్లో కేదార్ నాథ్ ఒకటి. చార్ ధామ్ యాత్రలో కేదార్నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. కేదార్ నాథ్ ఆలయం తిరిగి తెరుచుకోవడంతో భక్తులు తమ పర్యటనను షెడ్యూల్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. 

Tags:    

Similar News