TTD : శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం...

Update: 2025-09-16 07:57 GMT

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా స్వామివారి మూలవిరాట్ ను ప్రత్యేక వస్త్రంతో కప్పివేశారు. అనంతరం, ఆలయం లోపల, ఉప ఆలయాలు, ఆలయ గోడలు, పైకప్పులను, పూజా సామగ్రిని, తదితర వస్తువులను సుగంధ ద్రవ్యాలతో కూడిన పవిత్ర జలంతో శుద్ధి చేశారు. ఈ పవిత్రమైన ఆలయ శుద్ధి కార్యక్రమం ముగిసిన తర్వాత.. శ్రీవారి మూలవిరాట్‌కు అర్చకులు ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం, భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు.

కాగా సంప్రదాయం ప్రకారం...తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఏడాదిలో నాలుగు సార్లు నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, మరియు వైకుంఠ ఏకాదశి వంటి ముఖ్యమైన పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Tags:    

Similar News