డిసెంబర్ 29న కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం నిర్వహించనున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. మల్లన్న కళ్యాణం, జాతరపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జనవరి 19 నుంచి మార్చి 24 వరకు జరిగే జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రూ.46 కోట్లతో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. అటు త్వరలో సీఎం రేవంత్‌ను కలిసి స్వామి కళ్యాణోత్సవానికి ఆహ్వానించనున్నట్లు ఆమె తెలిపారు.
డిసెంబర్ 29 ఉదయం 10.45 గంటలకు మల్లికార్జున స్వామి వారి కల్యాణం జరగనుంది. జనవరి 19 నుంచి 10 వారాలపాటు మార్చి 23 వరకు జాతరను నిర్వహించేందుకు నిర్ణయించినట్లు మంత్రి సురేఖ ప్రకటించారు. ఈ దిశగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.