జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఇవాల్టి నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు మహా కుంభాభిషేకం క్రతువు ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో ఐదు కలశాలతో గోదావరి జలాలు కుంభాభిషేకానికి తీసుకు వచ్చి, గణపతి పూజలతో మహోత్సవ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. అచ్చలాపురం రుత్వికులు 11,08 కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. 1982లో ఆనాది శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యుల ఆధ్వర్యంలో కుం భాభిషేకం జరగ్గా.. మళ్లీ 42 ఏండ్ల తర్వాత ఈ మహాఘట్టం జరుగడం విశేషం.. శృంగేరి పీ ఠాధిపతులు ఆశీస్సులతో శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీస్వామి చేతులమీదగా ఆదివారం తెల్ల వారుజామున రాజగోపురాలకు సంప్రోక్షణ, మహాకుంభాభిషేకం జరుగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.