Srisailam : శ్రీశైలంలో కనుల పండువగా మల్లికార్జునుడి కళ్యాణం

Update: 2025-02-27 08:15 GMT

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జునుడి కళ్యాణం కనుల పండువగా సాగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, వేలాదిగా తరలివచ్చిన భక్తుల శివనామ స్మరణ, మంగళవాయిద్యాల మధ్య ఆ మల్లికార్జునుడు బ్రమరాంభ అమ్మవారి మెడలో మూడుముళ్లు వేశారు. అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలు పోశారు. ఈ వేడుకను చూసి భక్తులు తరించారు.

శ్రీశైలంలో పాగాలంకరణ సుమారు వంద సంవత్సరాలకు పై నుంచి జరుగుతుందని స్థానికుల సమాచారం. ఈ క్షేత్రంలో తప్ప ప్రపంచంలోని ఏ శైవ క్షేత్రంలోను ఇలాంటి ఆచారం లేదన్నది అక్షర సత్యం. పాగాలంకరణ జరిగే సమయంలో క్షేత్రం అంతటా విద్యుత్తు నిలిపివేస్తారు. చిమ్మ చీకటిలో పృథ్వీ వేంకటేశ్వర్ల వారి కుటుంబంలోని ఒక వ్యక్తి దిగంబరంగా ఈ పాగాలంకరణ చేయటం విశేషం. పాగాలంకరణ జరుగుతున్నంత సేపు ఆలయంలో శివనామ స్మరణ, పాగాలంకరణ విశేష వ్యాఖ్యానం జరుగుతుంటాయి. వేలాది మంది భక్తులు ఆలయంలో ఈ ప్రక్రియను భక్తితో వీక్షించడానికి వస్తారు. పాగాలంకరణ పూర్తి అయ్యాక బ్రహోత్సవ కల్యాణం జరిపిస్తారు.

Tags:    

Similar News