తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ ఎస్టీ కమీషన్ చైర్మన్ డీవీజీ శంకర రావు.,తమిళనాడు డీజీపీ శంకర్ జీవాల్.,భారతీయ వ్యవస్థాపకురాలు,జెట్‌సెట్‌గో చైర్మన్ కనికా టేక్రివాల్ లు కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. గురువారం కావడంతో భక్తుల రద్దీ కొంత మేర తగ్గింది. నిన్నటి వరకూ అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ విస్తరించేది. స్వామి వారిని దర్శించుకునేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. దాదాపు రెండున్నర నెలల నుంచి స్వామి వారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పట్టేది. అయితే నేడు అంత రద్దీ లేకపోయినా భక్తుల సంఖ్య సాధారణంగానే ఉంది. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.