దక్షిణభారత కుంభమేళాగా ఖ్యాతిగాంచిన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మల మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి నాలుగు రోజులపాటు ఈ మినీ జాతర జరగనుంది. రెండేళ్లకోసారి మేడారం మహా జాతర జరుగుతుండగా.. అధిక సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనంలో కొలువైన వనదేవతలు జనం మధ్యకు రావడంతో అడవి అంతా జనసంద్రమవుతుంది. మహా జాతర జరిగిన మరుసటి సంవత్సరం చిన్న జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శనివారం సమావేశమైన పూజారులు.. మినీ జాతర తేదీలను ప్రకటించారు.