Vice-Presidential : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్
మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన సీపీ రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం పూర్తైన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆయనను స్వామి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.