Nirmala Sitharaman : శ్రీవారిని దర్శించుకున్న నిర్మలా సీతారామన్

Update: 2025-09-12 07:57 GMT

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున జరిగిన శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న ఆమె.. ఆ తర్వాత వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మరోసారి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆలయం వద్ద నిర్మలా సీతారామన్‌కు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేంద్ర మంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోకి ప్రవేశించి, స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం, ఆలయ పండితులు రంగనాయకుల మండపంలో నిర్మలమ్మకు ఆశీర్వచనం చేశారు. అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ పర్యటనలో ఆమె పలువురు టీటీడీ అధికారులతో మాట్లాడి, ఆలయ పరిపాలన, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

Tags:    

Similar News