ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాలుగోరోజైన గురు వారం దాదాపు కోటిమంది భక్తులు మేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అన్ని ఘాట్లు భక్త జనంతో కిటకిటలాడాయి. ఇప్పటి వరకు మొత్తంగా ఆరు కోట్ల మంది భక్తులు ఇక్కడకు తరలివచ్చారని అధికారులు వెల్లడించారు. దేశ, విదేశాల నుంచి భారీసంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారని, ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.