దక్షిణ భారతదేశ పవిత్ర పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా దేశంలోనే పురాతన ఆలయాల్లో ఒకటైన కేరళలోని తిరువల్లం పరశురామర్ క్షేత్రాన్ని పవన్ కల్యాణ్ బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ట్రావెన్ కూర్ దేవ స్థానం బోర్డు అధికారులు, ప్రధాన అర్చకులు పవన్ కల్యాణ్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఆరవ అవతారమైన పరశు రాముడికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కండన్ సోమహరిపాద్ పవన్ కల్యాణ్ గోత్రనామాలతో పూజలు నిర్వహించి వేదాశీర్వచనం, తీర్ధప్రసాదాలు అందించారు.