TTD : భక్తి, నిబద్ధతతో విధులు నిర్వర్తించండి : టీటీడీ అదనపు ఈవో

Update: 2025-09-24 07:06 GMT

వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో విధులు నిర్వర్తించడానికి వచ్చిన డిప్యూటేషన్ అధికారులు, సిబ్బంది మరింత భక్తి, నిబద్ధతతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. సంబంధిత ప్రాంతాల్లో ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో సమన్వయం చేసుకుని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కోరారు. ఈసారి బ్రహ్మోత్సవాలను ఎంతో సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా రూపొందించామని, నిర్ధిష్ట విధివిధానాలతో పాటు చెక్‌లిస్ట్‌లను కూడా సిద్ధం చేశామని, తద్వారా భక్తుల నుండి సరైన ఫీడ్‌బ్యాక్ పొందేందుకు వీలుకలుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు, డిప్యూటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News