Tirumala : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ .. నేరుగా స్వామివారి దర్శనం

Update: 2025-01-29 12:15 GMT

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా స్వామివారి దర్శనం నేరుగా లభిస్తోంది. కాగా.. శ్రీవారిని నిన్న 70,610 మంది దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. వారిలో 17,310 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని పేర్కొన్నారు. ఇక స్వామివారికి హుండీ ద్వారా రూ.3.78 కోట్ల ఆదాయం సమకూరింది.

తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం రాత్రి అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 20వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయని అర్చకులు తెలిపారు. మాఘ మాసంలో ఆలయంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

Tags:    

Similar News