TTD : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 8గంటల సమయం

Update: 2025-07-26 12:00 GMT

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకాల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే దేశనలుమూలల నుంచి భక్తులు వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు వస్తారు. అయితే గత కొన్ని రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండగా.. ప్రస్తుతం అది తగ్గింది. ఇవాళ శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శుక్రవారం శ్రీవారిని 73,576 మంది భక్తులు దర్శించుకోగా.. 25,227 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న రూ.4.23 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

కాగా ఈ నెల 29న తిరుమలలో గరుడ పంచమి వేడుకలు నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు మలయప్పస్వామి గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెలలో స్వామివారు రెండో సారి గరుడ వాహనంపై దర్శనమివ్వనున్నారు. ప్రతి ఏడాదీ తిరుమ‌ల‌లో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉండేందుకు.. స్త్రీలు తమకు పుట్టే సంతానం మంచిగా ఉండేందుకు ”గరుడపంచమి” పూజ చేస్తారని పురాణాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News