తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవా టికెట్ల జూన్ నెల కోటాను ఇవాళ టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే, జూన్ 9- 11 వరకు జరుగనున్న శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలకు సంబంధించి టికెట్లు ఉ.11 గంటలకు రిలీజ్ అవుతాయి. వీటితో పాటు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూన్ నెల కోటా టోకెన్లు మ.3 గంటలకు విడుదల కానున్నాయి.
సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మనవడు దేవాన్ష్ జన్మదినం సందర్భంగా ఇవాళ అన్నప్రసాద వితరణ చేయనున్నారు. మంత్రి లోకేశ్‌తో సహా కుటుంబసభ్యులంతా నిన్న రాత్రి పద్మావతి గెస్ట్ హౌజ్‌కు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ ఛైర్మన్, ఈవో స్వాగతం పలికారు. అన్నప్రసాదాలు తీసుకోవడంతో పాటు భక్తులకు వడ్డించనున్నారు.