తిరుమల శ్రీవారిని సినీ హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. రాత్రి ఆయన అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు. తెల్లవారు జామున సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలోసాయి ధరమ్ తేజ్ను వేద పండితులు ఆశీర్వదించారు. యాక్సిడెంట్ తర్వాత పేరు మార్చుకుని, తొలిసారి తిరుమల కొండెక్కిన సాయి ధరమ్ తేజ్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.