TTD : తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే..?

Update: 2025-09-01 09:00 GMT

తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 23 సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాలకు సన్నాహకంగా సెప్టెంబర్ 16న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వివిధ వాహన సేవలు ఉంటాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

వాహన సేవల వివరాలు:

సెప్టెంబర్ 24: సాయంత్రం 5.43 గంటల నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహన సేవ.

సెప్టెంబర్ 25: ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ.

సెప్టెంబర్ 26: ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ.

సెప్టెంబర్ 27: ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహన సేవ, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహన సేవ.

సెప్టెంబర్ 28: ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి వరకు గరుడ వాహన సేవ.

సెప్టెంబర్ 29: ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహన సేవ.

సెప్టెంబర్ 30: ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ.

అక్టోబర్ 1: ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ.

అక్టోబర్ 2: ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు ధ్వజారోహణం.

ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అంచనా. భద్రత, భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

Tags:    

Similar News