తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ గాయని సునీత దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండలంలో పండితులు వేదశీర్వచనం అందించగా…. ఆలయం అధికారులు శేవ వస్ర్తంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల సునీత మీడియాతో మాట్లాడుతూ…. నూతన సంవత్సరం స్వామి వారి దీవెనలకోసం తిరుమలకు వచ్చానన్నారు. స్వామి వారి దర్శన అనంతరం తన్మయత్వం చెంది మాటలు రావడం లేదని తెలిపారు. స్వామి వారి వైభవాన్ని పాట రూపంలో కీర్తించారు.